జ్యోతక్క వార్నింగ్...నేను హైదరాబాద్ లోనే ఉంటా
on Jun 16, 2025
సుమ అడ్డా నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి శివజ్యోతి - గంగులు, కీర్తి - జై ధనుష్ వచ్చారు. కీర్తి - జై ధనుష్ కి ఎప్పుడూ గొడవలవుతూ ఉంటాయట..ఏ విషయంలో ఎక్కువగా గొడవలు అవుతాయని సుమ అడిగేసరికి. "టవల్ ఆరబెట్టరు" అని చెప్పింది కీర్తి. "ఈ టవల్ అనే యూనివర్సల్ ప్రాబ్లమ్ కి ఇంకో సొల్యూషన్ ఉంది" అని సుమ అనేసరికి " ఇంకో ట్వేల్ కొనుక్కోవాలి అని జై ధనుష్ చెప్పాడు. దాంతో సుమ "టవల్ లేకుండా చేయడం" అంది. " మీ ప్రాబ్లమ్ కూడా అదేనా" అని జ్యోతక్కను అడిగింది. "ఏది చెప్పినా ఆ చేస్తా చేస్తా అంటాడు.
ఆ మాట చెప్పేలోపు నేనే వెళ్లి చేసుకుంటా" అని చెప్పింది జ్యోతక్క.ఇక భార్యలను ఒక వైపు భర్తలను ఒక వైపునకు పంపింది సుమ. "మేము అసలు ఆంటీస్ లా లేము. వాళ్ళు మాత్రం అంకుల్స్ " అని శివజ్యోతి చెప్పింది. తర్వాత సుమ ఒక ప్రశ్న అడిగింది. " అబ్బాయిలు ఎక్కువగా ఎక్కడ టైం పాస్ చేస్తారు" అంది. "రెండు గంటలు బాత్ రూమ్ లో మా ఆయన టైం పాస్ చేస్తాడు" అని జ్యోతక్క చెప్పింది. ఇక కీర్తి ఐతే ఒక గంట అంటూ వేలెత్తి మరీ చూపించింది. "నీ మీద ఎలిగేషన్స్ వస్తే ఎలా ఎదుర్కుంటావ్" అని సుమ మళ్ళీ జ్యోతక్కను అడిగింది. "కొంచెం సీరియస్ గానే చెప్బ్దామనుకుంటున్నాను నేను. వాడు బతకడానికి లేని పోనీ ఎలిగేషన్స్ చేస్తున్నాడు. నేను హైదరాబాద్ లోనే ఉంటా" అంటూ గట్టిగానే ఎవరికో కానీ వార్నింగ్ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్స్ ప్రొమోషన్స్ మీద కొన్ని వివాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. మరి ఆ ఇష్యూ మీద వార్నింగ్ ఇచ్చిందా, ఎవరికీ, ఏంటి అనేది తెలియాలి అంటే నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ చూడాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
